అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YSRCP | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అధికారం పోయాక బలహీనపడిన వైఎస్సార్సీపీ(YSRCP) బలోపేతానికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి(Jagan) చర్యలు చేపట్టారు. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం(Kootami Govt) అధికారంలోకి రావడంతో చాలా మంది నేతలు వైసీపీని వీడారు. పదవులు అనుభవించిన వారు సైతం పార్టీని వదిలి వెళ్లిపోయారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులతో వైసీపీ నాయకులను హడెలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా.. మరికొందరు ముఖ్యనేతలపై కేసులు కూడా నమోదు చేసింది. దీంతో పార్టీ కేడర్‌లో నిస్తేజం అలుముకుంది. ఈ క్రమంలో పార్టీకీ పూర్వ వైభవం తీసుకురావడానికి జగన్ తాజాగా పొలిటికల్ అడ్వైజరి కమిటీ(PAC)ని నియమించారు. 33 మంది సభ్యులతో పీఏసీ ఏర్పాటు చేశారు. దీని కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనున్నారు.
అలాగే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని నియమించారు.