అక్షరటుడే, ఇందూరు: న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ గౌడ్ నియమితులయ్యారు. శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి మంగులాల్ పాల్గొని సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్మోహన్ సంఘ్ పరివార్ లో పనిచేస్తూ విద్యార్థి పరిషత్ జిల్లా, రాష్ట్ర నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. న్యాయవాద వృత్తిలో 25 ఏళ్లుగా పనిచేస్తూ, సామాజిక కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. సంఘ్ పరివార్ తో సుదీర్ఘంగా ఉన్న సంబంధాల నేపథ్యంలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో న్యాయవాదులు కృష్ణానంద్, వెంకటేశ్వర్, సాయి రెడ్డి, మాణిక్ రాజు, రవి, నారాయణ, వసంతరావు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.