అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ హైవే పక్కన గల చౌదరి రాజస్థాన్ దాబాలో పోలీసులు తనిఖీలు జరిపారు. దాబా నడుపుతున్న వ్యక్తి అశోక్ అలియాస్ దల్లు వద్ద నుంచి 210 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకి తరలించినట్లు డిచ్పల్లి సీఐ కొంక మల్లేష్ తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ కోరారు. సమావేశంలో ఎస్సై తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.