అక్షరటుడే, నిజామాబాద్‌ రూరల్‌ : సమగ్ర కుటుంబ సర్వేలో అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని జక్రాన్‌పల్లి ఎంపీడీవో సతీష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. సర్వే సిబ్బంది వచ్చిన సమయంలో ఆధార్‌కార్డ్‌, ధరణి పాస్‌బుక్కులు, రేషన్‌కార్డులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ కిరణ్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.