అక్షరటుడే, వెబ్డెస్క్ : Jamili elections | జమిలి ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అయి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah nayudu) అన్నారు. తిరుపతి(Tirupati)లో జమిలి ఎన్నికలపై శనివారం మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయ కారణాలతో కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వద్దంటున్నాయని ఆయన విమర్శించారు.
ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీ(Local Parties)లకు నష్టమనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణపై దేశం అంతా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఫిరాయింపులపై కూడా మాట్లాడారు. పార్టీ మారితే పదవులు పోయే చట్టం రావాలన్నారు.