అక్షర టుడే, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. మూడో విడత పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 415 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలు మొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నాయి. తొలి రెండు దశల్లో ఆశించిన మేర పోలింగ్ నమోదు కాకపోవడంతో చివరి విడతలో ఓటింగ్ శాతం పెరుగుతుందనే నమ్మకం పెట్టుకున్నారు.