అక్షరటుడే, వెబ్డెస్క్: Janhvi Kapoor | శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ మొన్నటిదాకా బాలీవుడ్ లో సినిమాలు చేయగా ఎన్టీఆర్ దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తంగం పాత్రలో అమ్మడి అందాల ప్రదర్శనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. దేవర సినిమాలో జాన్వి కేవలం గ్లామర్ షోకి, సాంగ్స్ కోసమే అన్నట్టుగా ఉంది. ఐతే దేవర 2 లో ఆమె పాత్ర ఏమైనా పవర్ ఫుల్ గా ఉంటుందేమో చూడాలి. ఐతే దేవర రిలీజ్ కు ముందే రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాకు సెలెక్ట్ అయ్యింది జాన్వి కపూర్.
ఆర్సీ 16 ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. ఐతే ఈ సినిమాలో జాన్వి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆర్సీ 16 నుంచి లేటెస్ట్ గా జాన్వి కపూర్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు అందాల భామ జాన్వి కపూర్ బర్త్ డే అవ్వడంతో ఆమెకు సంబందించిన పోస్టర్ వదిలారు. ఐతే ఈ పోస్టర్ లో జాన్వి క్యాజువల్ లుక్ తో కనిపిస్తుంది. పైన టీ షర్ట్ కింద ట్రాక్ ప్యాంట్ తో గొర్రె పిల్లను ఎత్తుకుని ఉంది.
ఐతే ఈ పోస్టర్ చూసి ఆర్సీ 16లో జాన్వి అదరగొట్టేస్తుందని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే చిరంజీవి, శ్రీదేవి జోడీ ఎలా అయితే సూపర్ హిట్ అయ్యిందో చరణ్, జాన్వి జోడీ కూడా అదే రేంజ్ క్రేజ్ తెచ్చుకోవాలని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఆర్సీ 16 మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.
బర్త్ డే పోస్టర్ తో జాన్వి కపూర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు ఆర్సీ 16 మేకర్స్. ఈ సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ తో టార్గెట్ మిస్ అయిన రాంచరణ్ బుచ్చి బాబు సినిమాతో భారీ టార్గెట్ తోనే వస్తున్నాడు. మరి ఈ సినిమాలో కన్నడ స్టార్ శివన్న కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మధ్యనే సినిమాకు సంబంధించిన లుక్ కోసం శివ రాజ్ కుమార్ తో లుక్ టెస్ట్ నిర్వహించారు.