అక్షర టుడే, వెబ్ డెస్క్ Janhvi Kapoor : బాలీవుడ్ (Bollywood) టాలీవుడ్ అనే తేడా లేకుండా తన సినిమాలతో అలరిస్తుంది (Janhvi Kapoor) జాన్వీ కపూర్. అమ్మడు లాస్ట్ ఇయర్ దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆర్సీ 16 సినిమాగా వస్తున్న పెద్ది సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఐతే సినిమాలతో పాటు జాన్వి కపూర్ ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. సోషల్ మీడియా ఫాలోవర్స్ ని మెప్పించేలా జాన్వి ఫోటో షూట్స్ ఉంటాయి.
ఐతే లేటెస్ట్ గా లాక్మె ఫ్యాషన్ వీక్ లో జాన్వి కపూర్ ర్యాంప్ వాక్ క్రేజీగా మారింది. లాక్మె ఫ్యాషన్ వీక్ లో భాగంగా జాన్వి కపూర్ చేసిన ఈ ర్యాంప్ వాక్ ఆమె ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో అందాలను ప్రదర్శించింది (Janhvi Kapoor) జాన్వి కపూర్. తన ఈ స్కిన్ షో అంతా కూడా ఆడియన్స్ లో తన మైలేజ్ పెంచుకునే ప్రయత్నంలో భాగమే అని చెప్పొచ్చు.
Janhvi Kapoor : ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్..
లాక్మె ఫ్యాషన్ వీక్ లో (Janhvi Kapoor) జాన్వి ర్యాంప్ వాక్ వీడియో ఒకటి (Social media) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన ఆడియన్స్ అంతా కూడా జాన్వి అందాలకు ఫిదా అయిపోతున్నారు. లాక్మె ఫ్యాషన్ వీక్ లో జాన్విని చూసి అక్కడ ఉన్న వారంతా కూడా ఆమెను వైపే చూస్తూ ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే దేవర సినిమాలో తంగం పాత్రలో నటించిన జాన్వి కపూర్ పెద్ది సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా సినిమాలో కూడా జాన్వి కపూర్ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఏదో ఒకరకంగా ఆడియన్స్ లో అమ్మడు టచ్ లో ఉంటూ అలరిస్తూ వస్తుంది. (Janhvi Kapoor) జాన్వి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగేలా చేస్తున్నాయని చెప్పొచ్చు.