Marubeni Corporation | తెలంగాణలో జపాన్​ పెట్టుబడులు.. సీఎం రేవతం పర్యటనలో కీలక ఒప్పందం

Marubeni Corporation | తెలంగాణలో జపాన్​ పెట్టుబడులు.. సీఎం రేవతం పర్యటనలో కీలక ఒప్పందం
Marubeni Corporation | తెలంగాణలో జపాన్​ పెట్టుబడులు.. సీఎం రేవతం పర్యటనలో కీలక ఒప్పందం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Marubeni Corporation | తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు జపాన్​ వ్యాపార దిగ్గజం మరుబెనీ (Marubeni Corporation) ముందుకొచ్చింది. జపాన్​ Japan పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి Chief Minister Revant Reddy ఈ మేరకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో Future City నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను Next Generation Industrial Park ఏర్పాటు చేసేందుకు సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఇండస్ట్రియల్ పార్క్ industrial park ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.

Advertisement

Marubeni Corporation | రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు

మరుబెనీ సంస్థ Marubeni company రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో investment ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను world -class Next Generation Industrial Park అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒప్పందానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ (letter of intent)పై సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.

జపాన్, ఇతర మల్టీనేషనల్ కంపెనీలు multinational companies హైదరాబాద్‌లో Hyderabad తమ తయారీ ప్లాంట్లను manufacturing plants ఏర్పాటు చేసేందుకు ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. దీనిద్వారా రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించనున్నారు.

Marubeni Corporation | ఫ్యూచర్ సిటీలో తొలి ప్రాజెక్ట్​ : సీఎం

మరుబెనీ సంస్థ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా green pharma, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారించనుంది. చర్చల సందర్భంగా సీఎం ఎ.రేవంత్ రెడ్డి CM A. Rewant Reddy మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే తొలి ప్రాజెక్ట్ first project ఇదే అవుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా తెలంగాణలో సుమారు 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

తెలంగాణలో Telangana వ్యాపారానికి అనుకూలమైన అవకాశాలున్నాయని favorable opportunities, మరుబెనీకి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం government అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీ Future City భారతదేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా first net Zero City అభివృద్ధి చెందుతుందన్నారు. మరుబెనీ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement