గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా గవర్నర్‌ తమిళిసై తన పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్‌ గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బుధవారం రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.