Jio Hostar Subscription : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ (IPL season) జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లవర్స్ సాయంత్రం అయితే చాలు, ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు చూడాలా స్మార్ట్ ఫోన్ (Smart phone) ఓపెన్ చేసి హాట్ స్టార్ లో లైవ్ చూస్తుంటారు. అయితే.. జియో హాట్ స్టార్ లో అన్ లిమిటెడ్ ఆఫర్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. అన్ లిమిటెడ్ ఆఫర్ తో జియో హాట్ స్టార్ లో (Jio Hostar Subscription) ఉచితంగా మ్యాచ్ లు చూసుకునే అవకాశం కల్పించింది.
అయితే, అన్ లిమిటెడ్ ఆఫర్ (Unlimited offer) కింద మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది. కానీ, ఈ అన్ లిమిటెడ్ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా జియో (Jio) ప్రకటించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్ స్టార్, Free Jio Hotstar, Jio Fiber, జియో ఫైబర్ 50 డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ను అందిస్తోంది.
Jio Hostar Subscription : మార్చి 17న ఆఫర్ ప్రకటన
మార్చి 17న రూ.299 ప్యాకేజీని ప్రకటించింది జియో. కనీసం రూ.299 కంటే ఎక్కువ అమౌంట్ తో రీచార్జ్ చేస్తే 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ ను ఉచితంగా చూడొచ్చు. కాకపోతే ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రం మార్చి 31 వరకు మాత్రమే చూసే చాన్స్ ఉండేది. కానీ, ఇప్పుడు ఏప్రిల్ 15 వరకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లు చూడొచ్చు. రూ.299 తో రీచార్జ్ చేసుకున్న వాళ్లకు రోజుకు 1.5 జీబీ డేటా కూడా వస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే.. ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ అభిమానులు పండుగ చేసుకోవచ్చన్నమాట.