
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL | మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ipl 2025 సీజన్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే దీనికి సంబంధించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి.తమ తమ అభిమాన టీమ్స్‌లో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది వంటి విషయాల గురించి తెలుసుకునే ఆసక్తి చూపుతున్నారు. ఇక ఐపీఎల్ స్టార్ట్ అయితే ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా వీక్షించాలని ప్లాన్స్ చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ . ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లోనే jio Hotstar లైవ్ స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది జియో.
ఇటీవల రిలయన్స్ జియో, డిస్నీ disney hotstar హాట్‌స్టార్ విలీనం కావడంతో సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రేమికులు కొంత నిరాశ వ్యక్తం చేయగా, ఇప్పుడు జియో సంస్థ వినియోగదారులకు ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. కొన్ని ప్రత్యేక ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే ప్రత్యేక ఆఫర్ పొందే అవకాశం దక్కుతుంది. కొత్త, పాత వినియోగదారులు అందరూ ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే ఛాన్స్ కూడా లభిస్తుంది..
మొబైల్ మరియు టీవీలో 4K క్వాలిటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా.. దీనికి అదనంగా 50 రోజుల పాటు జియో ఫైబర్ jio fiber సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయి. ఇందులో అన్‌లిమిటెడ్ వైఫై, 800 కంటే ఎక్కువ OTT ఛానెల్స్, 11 OTT యాప్‌లు ఉంటాయి. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు మార్చి 17 – మార్చి 31, 2025 మధ్య జియో సిమ్‌ను కొనుగోలు చేయాలి. వారి ప్రస్తుత జియో నంబర్‌ను రూ.299 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. మార్చి 17 కి ముందు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు రూ.100 యాడ్-ఆన్ ప్యాక్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. జియో హాట్ స్టార్ ఉచిత ప్యాక్ మార్చి 22, 2025 క్రికెట్ సీజన్ మొదటి మ్యాచ్ రోజు నుండి 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.