అక్షరటుడే, కామారెడ్డి: ఆస్పత్రుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. రోగులు వ్యర్థ పదార్థాలను చెత్త డబ్బాల్లోనే వేయాలని సూచించారు. ఆర్వో ప్లాంట్ వృథా నీటిని ఇతర పనులకు వినియోగించాలన్నారు. అలాగే రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజీవ్‌నగర్‌లోని అర్బన్ పీహెచ్‌సీని పరిశీలించారు. ఇటీవల ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపిన ఘటన విధితమే.