అక్షరటుడే, బిచ్కుంద: Job Mela | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్(Government Degree College Autonomous)లో ఈనెల 9న జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్(College Principal K. Ashok) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్లేస్మెంట్ సెల్(Placement Cell), రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో ‘ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ’(MSN Pharma Company)లో జూనియర్ ట్రైయినీ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందన్నారు.
కెమిస్ట్రీ(Chemistry) ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి 2021, 2022, 2023, 2024లలో బీఎస్సీ(BSC) పూర్తి చేసుకున్న విద్యార్థులు(Students) ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ప్రస్తుతం బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా హాజరుకావచ్చని పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 9న ఉదయం 10 గంటలకు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళా(Job Mela)కు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ ప్రాంత పరిధిలోని సైన్స్ విద్యార్థులు(Science students) సద్వినియోగం చేసుకోవాలని కోరారు.