వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

0

అక్షరటుడే, నిజామాబాద్: వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ హెచ్ ఎం పరిధిలో ఎపిడెమియాలజిస్టు -1, న్యూట్రిషన్ కౌన్సెలర్ -1, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ -1 చొప్పున పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఈ నెల 11లోపు దరఖాస్తులను జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి.