అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వర్మి కంపోస్ట్ షెడ్ పరిశీలించి, కంపోస్టు తయారీ విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో సతీష్‌కుమార్, డీఎల్పీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, తదితరులున్నారు.