అక్షరటుడే, బాన్సువాడ: పట్టణానికి చెందిన గులాబీ పార్టీ కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పాత బాలకృష్ణ, కౌన్సిలర్లు శ్రీనివాస్, రమాదేవి, రుక్మిణి, హైమద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.