అక్షరటుడే, జుక్కల్: మహమ్మద్ నగర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగాయి. గన్కుల్ సొసైటీ మాజీ చైర్మన్ మొహిజుద్దీన్ తో పాటు తునికిపల్లి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జయప్రదీప్, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు మల్లయ్యగారి ఆకాష్, సావైసింగ్, గంగి రమేష్ పలువురు పాల్గొన్నారు.