అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఉమ్మడి జిల్లా ఐడీసీఎంస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్ అన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మండలంలోని కమలాపూర్, మిట్టపల్లి సొసైటీ పరిధిలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. వరికి రూ.500 బోనస్ వస్తుందని రైతులు దళారులకు ధాన్యం విక్రయించవద్దన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూలసాని శ్రీనివాస్, ఐడీసీఎంస్ డైరెక్టర్ న్యాయ రాజేశ్వర్, డిచ్‌పల్లి సొసైటీ ఛైర్మన్ రామచంద్ర గౌడ్, రాంపూర్ సొసైటీ చైర్మన్ గంగారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.