అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రాలను పెంచామని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌లతో కలిసి ఇందల్వాయిలోని చంద్రాయన్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సన్నరకం ధాన్యం కోసం 439 కేంద్రాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 370 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సర్వేపై సమీక్షించారు. జిల్లాలో సర్వేకు 3,247 ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకాధికారి వెంట ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం రాజేశ్వర్ తదితరులున్నారు.