Thirumala | నేడు తిరుమలకు న్యాయ విచారణ కమిషన్

Thirumala | నేడు తిరుమలకు న్యాయ విచారణ కమిషన్
Thirumala | నేడు తిరుమలకు న్యాయ విచారణ కమిషన్

అక్షరటుడే, తిరుమల:Thirumala | తిరుపతి(Tirupathi)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్(Collectorate) లో మంగళవారం జరిగిన 5వ దశ విచారణలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ(TTD) తరఫున దేవస్థానాల లా ఆఫీసర్(డీఎల్వో) వరప్రసాదరావు హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదికలను కమిషన్‌కు అందజేశారు.

Advertisement

ఇక జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయం( Thirumala Srivari Temple)తో పాటు క్యూలైన్లను(Queue Lines) మరోసారి పరిశీలిస్తారు. చివరిగా విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ ఈవోకు సమన్లు పంపనున్నట్లు సమాచారం. భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సలహాలు, సూచనలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  vasavi janata foundation | మహిళలు స్వయం ఉపాధితో వృద్ధిలోకి రావాలి