అక్షరటుడే, జుక్కల్‌: కాంగ్రెస్‌ పార్టీ కృషితోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఆదివారం బిచ్కుంద మార్కెట్‌యార్డులో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ నిర్వహించారు. మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డప్పు దరువులతో భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడారు. మాదిగల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.