అక్షరటుడే, జుక్కల్‌ : ప్రభుత్వ ఉద్యోగి చేసిన సేవలను పదవీ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి గార్డెన్‌ లో రాష్ట్ర పీఆర్టీయూ శాఖ ఉపాధ్యక్షుడు పరమేశ్వర్‌ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్, పీఆర్టీయూ నాయకులు శ్రీపాల్‌ రెడ్డి, గుండు లక్ష్మణ్‌, మోహన్‌ రెడ్డి, కమలాకర్‌ రావు, పీఆర్టీయూ పిట్లం మండలాధ్యక్షుడు బన్సీలాల్‌, సభ్యులు నారాయణ, సంతోష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మురళీ గౌడ్‌, మోహన్‌ రెడ్డి, వెంకటరెడ్డి, బడ్ల రాజు, దయానంద్‌, హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement