అక్షరటుడే, జుక్కల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. అలాగే నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో సొసైటీ చైర్మన్‌ శివానంద్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో హంగర్గ మాజీ ఎంపీటీసీ నాగనాథ్‌ నాయకులు బాలాజీ పటేల్‌, శంకర్‌, రాజు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.