అక్షరటుడే, జుక్కల్: జుక్కల్ కు చెందిన ప్రతిభ అనే క్రీడాకారిణి పలు ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటుతోందని, ఆమె ప్రతిభను గుర్తించాల్సిన అవసరముందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో విషయమై ప్రస్తావించారు. తెలంగాణ క్రీడాకారులైన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ లను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని.. అయితే జుక్కల్ కు చెందిన ప్రతిభ కోల్ కతాలో జరిగిన ఇండియా, ఏషియన్ చెస్, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఐదు బంగారు, ఒక వెండి పతకం సాధించిందని పేర్కొన్నారు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో కనీస క్రీడా సౌకర్యాలు లేకున్నా రాణిస్తోందన్నారు. ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకం అందించాలని కోరారు.