అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండల కేంద్రంలో అక్షయ మోటార్స్ (ఎలక్ట్రిక్ బైక్స్ ) షోరూంను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారికి సూచించారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ బైక్‌లు ఎంతో ఉప‌క‌రిస్తాయ‌ని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, నిజాంసాగర్, పిట్లం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, హనుమాన్లు, నాయకులు బొడ్ల రాజు, శివకుమార్ నిర్వాహకులు లక్ష్మారెడ్డి, శ్రీధర్ ఉన్నారు.