అక్షరటుడే, జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును యువకులు అడ్డుకున్నారు. సోమవారం ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి జుక్కల్ మండల కేంద్రంలో ప్రారంభించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఎమ్మెల్యే కాన్వాయ్‌ను స్థానిక యువకులు అడ్డుకున్నారు. మండలంలో రోడ్లు బాగు చేయాలని కోరగా.. ‘తమాషా చేస్తున్నారా’ అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో స్థానిక నాయకులు, అధికారులు యువకులను సముదాయించి పంపించేశారు.