అక్షరటుడే, జుక్కల్: బిచ్కుంద మార్కెట్ యార్డులో ఈనెల 11న నిర్వహించనున్న ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ తీర్పు వల్ల మాదిగల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఈ చారిత్రాక ఘట్టాన్ని పండుగలా చేసుకోవడానికి విజయోత్సవ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.