అక్షరటుడే, జుక్కల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మాగి గ్రామానికి చెందిన కొండ కిష్టమ్మ,కొప్పుల ఏకనాథంకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మాగి కాంగ్రెస్ నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్, గుర్రపు వెంకన్న, బాల సాయిలు తదితరులు పాల్గొన్నారు.