అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Waqf Bill | వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pavan Kalyan) స్పందించారు. వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. వక్ఫ్‌బోర్డు(Waqf Board) కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. తాజా సవరణలతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తోందని కొనియాడారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని పవన్ కల్యాణ్ అన్నారు.
Waqf Bill | వక్ఫ్ బిల్లుతో పేద ముస్లింలకు న్యాయం : పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement