అక్షరటుడే, ఇందూరు: ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతోనే కేంద్రంలో బీజేపీకి మూడోసారి సీట్లు తగ్గాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మహాసభలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూడా పాలన దారుణంగా తయారైందన్నారు. రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యురాలు రమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నాయకులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.