Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేదపండితుల ఆశీస్సుల మధ్య మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో పలు విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు సీఎస్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement