అక్షరటుడే, కామారెడ్డి: రామారెడ్డి-ఇసన్నపల్లి గ్రామంలో కొలువైన కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. 20న ఉదయం సంతతధారాభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 21న మధ్యాహ్నం బద్ది పోచమ్మకు బోనాలు, 22న సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన నిర్వహించనున్నారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి డోలారోహణం, అన్నదానం, సాయంత్రం 5 గంటలకు ఎడ్ల బండ్ల ఊరేగింపు, రాత్రి రథోత్సవం జరగనున్నాయి. 24న అగ్నిగుండాలతో వేడుకలు ముగుస్తాయి. ప్రతి సంవత్సరం స్వామివారి జన్మదిన వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివస్తారు.