అక్షరటుడే, ఆర్మూర్ : బీజేపీ సభ్యత్వ నమోదులో క్రియాశీల సభ్యత్వ లక్ష్యం చేరుకోవాలని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ సూచించారు. మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ సంస్థాగత కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు, మండల పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జీలకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భద్రాచలం ఇన్‌ఛార్జి రాజేష్, మాజీ జెడ్పీటీసీ సందన్న, మండలాధ్యక్షుడు రోహిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, వినోద్, బూత్ అధ్యక్షులు, తదితరులున్నారు.