అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
కోర్సుల వివరాలు..
B.Sc. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ – కార్డియో వాస్కులర్ టెక్నాలజీ, మూత్రపిండ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ – ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ – స్పీచ్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, B.Sc. రేడియో థెరపీ టెక్నాలజీ, BPT (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 29 నుంచి నవంబర్ చేసుకోవచ్చు. స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను అప్‌లోడ్ ఆరో తేదీ సాయంత్రం 6 గంటలోగా https://alliedhs.tsche.in తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ ఆధారంగా అర్హుల జాబితాను ప్రకటించి, సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు.
కోర్సు వ్యవధి: ఏడాది ఇంటర్న్ షిప్ తో సహా నాలుగు సంవత్సరాలు
వయసు: డిసెంబర్ 31, 2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు: OC, BC అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ రుసుము రూ.2,500/- (బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు అదనం). SC/ST అభ్యర్థులకు రూ.2000/- (బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు అదనం). ఫీజును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ల అప్లోడ్ పీడీఎఫ్ ఫార్మాట్లో..
- జనన ధృవీకరణ పత్రం (SSC మార్క్స్ మెమో)
- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష
- 9 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- బదిలీ సర్టిఫికెట్
- తాజా కుల ధ్రువీకరణ పత్రం
- తల్లిదండ్రుల ఆదాయ ధ్రువపత్రం
- నివాస ధ్రువపత్రం
- ఆధార్ కార్డు
- తాజా పీపీ ఫొటో
- అభ్యర్థి సంతకం
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఈ క్రింది నంబర్‌లను సంప్రదించవచ్చు..
సాంకేతిక సహాయం కోసం: 9392685856, 7842136688, 9059672216
వెబ్ ఎంపికలను అమలు చేయడం వంటి సాంకేతిక సమస్యల కోసం : tsparamed.tech@gmail.comకు ఇమెయిల్ చేయండి
నిబంధనలపై వివరణల కోసం: 7901098840, 9490585796
ఏవైనా ఇతర సమస్యల కోసం: knrparamedadmission@gmail.comకు ఇమెయిల్ చేయండి (ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 వరకు మాత్రమే)
చెల్లింపు గేట్‌వే సమస్యల కోసం: 9618240276