అక్షరటుడే, జుక్కల్: మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టును మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, నీటిమట్టం, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలకు 0.802 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. అలాగే మండలంలో వర్షాలతో రోడ్లు, చెరువులు, వాగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ హిమబిందు, ఇరిగేషన్ ఏఈ రవిశంకర్, ఆర్‌ఐ రాంపటేల్, మాజీ సర్పంచ్ కిషన్ పవర్ ఉన్నారు.