అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: ప్రజలకు తాగునీటిని అందించే ఫిల్టర్‌బెడ్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. మంగళవారం ‘స్వచ్ఛదనం–పచ్చదనం’లో భాగంగా తాగునీరు, వర్షపు నీటి సంరక్షణపై పర్యవేక్షించారు. ఎంబీఆర్‌ ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. కలుషితం కాని స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు. అనంతరం పెద్దచెరువు వద్ద ఈత మొక్కలు నాటారు. చెరువుకట్టపై ముళ్ల కంచెలు, పిచ్చి మొక్కలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా మేజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, వైస్‌ ఛైర్ పర్సన్‌ వనిత రవి, అటవీ శాఖాధికారి సుజాత, కమిషనర్, ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, తదితరులున్నారు.