అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం పక్కాగా వేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం రామారెడ్డి మండలం పోసానిపేట్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని శుభ్ర పరచాలని మానిటరింగ్ అధికారిని ఆదేశించారు. అలాగే 40 కిలోల 600 గ్రాముల ధాన్యం బస్తాలో నింపి పక్కాగా తూకం వేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల వలన ధాన్యం తడిసి పోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రాం మోహన్, మానిటరింగ్ అధికారి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.