అక్షరటుడే, కామారెడ్డి టౌన్: క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడితే విజయం సాధ్యమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గర్గుల్ కు చెందిన మన ఊరి ఫౌండేషన్ ప్రతినిధులు కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ చేతుల మీదుగా హాకీ క్రీడాకారులకు రూ. 25 వేల విలువైన క్రీడా దుస్తులు, పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయమే లక్ష్యంగా ఆడి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. మన ఊరి ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, సురేష్ రెడ్డి, భీమ్ రెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి, ప్రభాకర్, పీడీ మధుసూదన్ రెడ్డి, జగన్నాథం, క్రీడాకారులు పాల్గొన్నారు.