అక్షరటుడే, కామారెడ్డి : గంగమ్మ వాగు వద్ద కల్వర్టు నిర్మాణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి శివారులోని కొనసాగుతున్న కల్వర్టు పనులను బుధవారం పరిశీలించారు. కల్వర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్అండ్ బీ, ఈఈ రవిశంకర్, డీఈ జలిగామ శ్రీనివాస్, ఏఈ రవితేజను ఆదేశించారు. అనంతరం రామారెడ్డి లోని కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేశారు. వసతిగృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కేజీబీవీలో చేపట్టిన మరమ్మతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీవో సురేందర్, అడిషనల్ పీడీ రామన్ రావు, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఎంఈవో యోసెఫ్, వసతి గృహం ప్రత్యేకాధికారిణి వనిత తదితరులున్నారు.