ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పారదర్శకంగా పనిచేయాలి

0

అక్షరటుడే, కామారెడ్డి: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పారదర్శకంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ లోని ఎన్ఐసి గదిలో జిల్లా ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి బృందాలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బృందాలు పక్కాగా పని చేయాలని, సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీవో వై. రంగనాథ రావు, ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, కామారెడ్డి తహశీల్దార్ జనార్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.