పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలి

0

అక్షరటుడే, కామారెడ్డి: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే లా అధికారులు సమన్వయంతో పని చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 28 నుండి మర్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, మొత్తం 37 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మాస్ కాపీయింగ్ కు తావులేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డీఈఓ రాజు, డిసిఆర్బి డీఎస్పీ మదన్ లాల్, పరీక్షల సహాయ కమీషనర్ లింగం, జిల్లా ఖజానా అధికారి సాయిబాబ, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.