అక్షరటుడే, కామారెడ్డి: నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో జయశంకర్ కాలనీలో పెంచుతున్న నర్సరీని శనివారం కలెక్టర్ పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా ప్రతినిత్యం నీళ్లు పట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. హరితహారం కోసం మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు.