అక్షరటుడే, కామారెడ్డి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఆర్డీవో రంగనాథ రావు, ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రిన్సిపాల్ వనిత, తహసీల్దార్ జనార్దన్ పాల్గొన్నారు.