అక్షరటుడే, కామారెడ్డి: సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీల్లో తాత్కాలికంగా కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న ఉద్యోగులు అంతర్ జిల్లా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న కేజీబీవీ నుంచి ఇతర కేజీబీవీలకు బదిలీ కోసం అభ్యర్థనలను సమగ్ర శిక్ష వెబ్ సైట్లో https://schooledu telangana gov in/ISMS/ సమర్పించాలన్నారు. ఈనెల 22, 23వ తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు, మార్గదర్శకాలను వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.