అక్షరటుడే, కామారెడ్డి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం భిక్కనూరు మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి షబ్బీర్‌అలీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్ భిక్కనూరు మండలాధ్యక్షుడు, ఆత్మ కమిటీ ఛైర్మన్ నర్సింహారెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, జంగంపల్లి మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ ఉన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, నాయకులు భీంరెడ్డి, గల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, సుదర్శన్, లింబాద్రి, మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అంకం రాజు పాల్గొన్నారు.