మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత

0

అక్షరటుడే, కామారెడ్డి: ప్రధాని మోదీ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కుతోందని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన నారిశక్తి వందన్‌ ముగింపు సభలో ప్రధాని ప్రసంగాన్ని రాజంపేట మండలం శివాయిపల్లిలో మహిళలు వర్చువల్‌గా వీక్షించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు ప్రధాని మోదీ ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్‌ కల్పించిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.