అక్షరటుడే, కామారెడ్డి: నేటి సమాజంలో మహిళలు హింసకు గురవుతున్నారని, అత్యాచారాలు, లైంగిక వేధింపుల నుంచి వారిని కాపాడాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌ వరప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం న్యాయ సేవాధికార సంస్థ, వర్డ్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ర్యాలీ జిల్లా కోర్టు నుంచి మున్సిపల్‌ ఆఫీస్‌ వరకు సాగింది. కార్యక్రమంలో జూనియర్‌ జడ్జి సుధాకర్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దీక్ష, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌, కోర్టు సూపరింటెండెంట్స్‌ వెంకట్‌ రెడ్డి, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.