అక్షరటుడే, కామారెడ్డి టౌన్ : యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 283 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఛైర్ పర్సన్ ఇందుప్రియ, డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ రావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఐవీఎఫ్ సేవాదళ్ స్టేట్ ఛైర్మన్ బాలు, దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.