అక్షరటుడే, కామారెడ్డి : సొంత తమ్ముడిని కర్రతో కొట్టి చంపిన అన్నకు జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ ఐదేళ్ల జైలు శిక్ష విధించారని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన అల్లం ప్రభాకర్ మద్యానికి బానిసై తమ్ముడు శివకుమార్ ను తరచూ డబ్బుల కోసం వేధించేవాడు. డబ్బులు ఇవ్వడం లేదని మనసులో పెట్టుకుని 2022 అక్టోబర్ 1న శివకుమార్ ను కర్రతో తలపై కొట్టి చంపేశాడు. నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా.. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.